‘కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి’

అమరావతి : రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్‌ చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజంటేషన్‌ ఇచ్చారు. అలాగే కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలతోపాటు పేద పిల్లలు చాలా మంది దీనివల్ల లబ్ధి పొందుతారని తెలిపారు.